చిరంజీవి డైరెక్టర్ ని ఆదుకున్న పూరి జగన్నాధ్

Published on Nov 21,2019 05:35 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్ళు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండగా చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు స్పందించి ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఆ జాబితాలో తాజాగా దర్శకులు పూరి జగన్నాధ్ కూడా చేరాడు. రాజ్ కుమార్ కు 50 వేల ఆర్ధిక సహాయం అందించాడు దర్శకులు పూరి జగన్నాధ్. ఈ దర్శకుడితో పాటుగా మెహర్ రమేష్ కూడా 10 వేలు అందించాడు.

ఇంతకుముందు కాదంబరి కిరణ్ మనం సైతం తరుపున 25,000/- ల ఆర్ధిక సహాయం అందించిన విషయం తెలిసిందే. అలాగే మరొకరు 41,000/- అందించారు. ఇలా పలువురు స్పందించి ఆర్ధిక సహాయం అందిస్తుండటంతో వాళ్లకు కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాడు దర్శకులు రాజ్ కుమార్. పునాదిరాళ్ళు చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.