టాలీవుడ్ , బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న పురాణపండ ' హనుమంతుడు'

Published on Oct 01,2019 11:16 AM

అనంత రూపాలతో, అనంత బాహువులతో  మహా స్వరూపంగా ఈ లోకాన్ని సంరక్షిస్తున్న
ఆంజనేయ భగవానునిపై  ఈ దేశంలో తొలిసారిగా ప్రముఖ రచయిత , శ్రీశైల
దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్  రచనా సంకలనఁగా
అమోఘ రీతిలో వెలువరించిన ఉపాస్య విశేష సంచిక ' నేనున్నాను' అద్భుత
ఉపాస్య గ్రంధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.   పీఠాధిపతులు,
మఠాధిపతులు , మేధావి వర్గంతో పాటు  ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్
ప్రముఖుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ ఉదయం ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నుండి ఈ ' నేనున్నాను '
గ్రంధాన్ని స్వీకరించిన బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ తన ఆరాధ్య దైవం
ఆంజనేయునిపై ఇంతటి గ్రంధాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ,
భాష రాకున్నా ఈ మహా గ్రంధాన్ని తన పూజా మందిరంలో పూజ్య స్థానంలో
ఉంచుతానని చెప్పారు. పురాణపండ శ్రీనివాస్ కి ఈ సందర్భగా ధన్యవాదాలు
తెలిపారు.
టాలీవుడ్ అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి,  'లెజెండ్' బాలకృష్ణ,
దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.ఎస్.కీరవాణి, , జూనియర్
ఎన్టీఆర్ తదితర సినీ  ప్రముఖులు ఈ మహాగ్రంధాన్ని స్వీకరించి ఈ గ్రంథ
సౌందర్యాన్ని, రచనా సంకలన వైభవాన్ని ప్రశంసించారు.
భారతదేశంలో తొలిసారిగా ఐదువందల  ఆంజనేయ మూల విరాట్టులతో, యంత్ర మంత్రం
తంత్రాత్మకంగా పురాణపండ శ్రీనివాస్  అద్భుతంగా రూపొందించిన ఈ '
నేనున్నాను ' మహాగ్రంధాన్ని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ' వారాహి చలన
చిత్రం' అధినేత  సాయి కొర్రపాటి  సమర్పణాభావంతో ప్రచురించడం గమనార్హం.
అతి అరుదైన ఆంజనేయ వర్ణచిత్రాలతో, నాణ్యతా ప్రమాణాల అపురూప ముద్రణతో,
పురాణపండ శ్రీనివాస్  అద్భుత భాషా సొగసులతో చాలా చక్కగా  అందిన ఈ హనుమాన్
బడా బుక్  తెలుగులో ఇంతవరకూ ' న భూతొ న భవిష్యత్ ' అన్నారు మెగాస్టార్
చిరంజీవి.
మంత్ర విద్యలకు మహాకేంద్రంగా ఈ హనుమాన్ బుక్ ని నందమూరి బాల కృష్ణ అభివర్ణించారు.
తెలుగు రాష్ట్రాలలోని ఆంజనేయాలయాలకు,  వేదపాఠశాలలకు, పండిత ప్రముఖులకు
గ్రంథాలయాలకు, సాంస్కృతిక  సంస్థలకు ఈ ఐదు వందల పేజీల ఆంజనేయ  వైభవాన్ని
సాయి కొర్రపాటి ఉచితంగా  అంజేస్తుండతాన్ని  పలువురు ప్రముఖులు అభినందనలు
వర్షిస్తున్నారు.