రోజా మీద పంచ్ వేసిన అనసూయ

Published on Jan 18,2020 12:25 PM

హాట్ భామ అనసూయ రోజా మీద పంచ్ వేసి సంచలనం సృష్టించింది. ఇంతకీ రోజా మీద అనసూయ వేసిన పంచ్ ఏంటో తెలుసా ....... బతుకు జట్కా బండి కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ వస్తే రోజా జడ్జి స్థానంలో ఉంటుందా ? లేక శేఖర్ మాస్టర్ కు ఆపోజిట్ గా ఉంటుందా ? అన్నది. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కు రోజా అంటే విపరీతమైన ప్రేమ అన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ రోజా సమక్షంలోనే పలుమార్లు వెల్లడించాడు శేఖర్ మాస్టర్. అయితే తాజాగా అనసూయ తో డ్యాన్స్ చేసాడు శేఖర్ మాస్టర్.

దాంతో రోజా ని పక్కన పెట్టి అనసూయని తన దేవతగా మలుచుకున్నాడని సెటర్లు వేశారు. అదే సందర్భంలో బతుకు జట్కా బండి వ్యవహారం ముందుకు వచ్చింది. బతుకు జట్కా బండిలో విడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి చర్చించే కార్యక్రమం అన్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో రోజా రెండు వైపుల ఉన్నవాళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది అలాంటిది ఆమె ఏ వైపున ఉంటుంది అన్న అనసూయ ప్రశ్నతో అవాక్కయ్యారు.