తనపై కుట్ర జరిగిందంటున్న 30 ఇయర్స్ పృథ్వీ

Published on Feb 24,2020 07:54 PM

తనపై కుట్ర జరిగిందని తాజాగా మరోసారి వాపోయాడు 30 ఇయర్స్ పృథ్వీ. ఎస్వీ బీసీ ఛానల్ లో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పృథ్వీ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అయితే విజిలెన్స్ కమీషన్ విచారణ అని టీటీడీ చైర్మన్ అన్నారు కానీ దాని అతీగతీ ఇంతవరకు తేలలేదు అయితే పృథ్వీ కి మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది ఆ ఆడియో విషయంలో.

ఆడియో సంగతి తేలలేదని కాబోలు మరోసారి తనపై కుట్ర జరిగిందని నేనెలాంటి తప్పు చేయలేదని అంటున్నాడు ఈ హాస్య నటుడు. ఆడియో టేప్ లో ఎవరు మాట్లాడారో కానీ ఆ ఆడియో లోని కొన్ని డైలాగ్ లతో స్కిట్ లు కూడా చేసారు జబర్దస్త్ , అదిరింది టీమ్ సభ్యులు. ఒకవైపు సినిమాలు లేక మరోవైపు వచ్చిన పదవి ఆర్నెళ్లు కూడా లేకుండాపోవడంతో తీవ్ర మానసిక ఆవేదనకు లోనయ్యాడట పాపం.