చెప్పుతో కొట్టుకున్న పృథ్వీ

Published on Mar 02,2020 09:39 PM

30ఇయర్స్ పృథ్వీ తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నాడట అది కూడా అద్దం ముందు కూర్చొని. చెప్పుతో ఇలా కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా ......... తనపై భారీ కుట్ర చేయడంతో దాన్ని తెలుసుకోకుండా బలి అయినందుకు బాధపడుతున్నాడు పాపం. ఎస్వీబీసీ ఛానల్ లోని ఓ మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా ఫోన్ లో మాట్లాడుతూ అడ్డంగా బుక్కైన ఆడియో బయటకు రావడంతో పాపం ఈ నటుడు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

తన పక్కనే ఉన్నవాళ్లు ఇంతటి దారుణానికి పాల్పడి ఉన్నారని కానీ నేను గుడ్డిగా వాళ్ళని నమ్మి మోసపోయానని కుమిలిపోతున్నాడు. అయితే తనపై కుట్ర చేసిన వాళ్ళని గమనించకుండా కుట్రకు బలైనందుకు గాను , తన తెలివితక్కువ తనానికి తనని తానూ నిందించుకుంటూ అద్దం ముందు కూర్చొని తన చెప్పు తీసుకొని చాలాసార్లు కొట్టుకున్నాడట 30 ఇయర్స్ పృథ్వీ. తనదైన టైమింగ్ తో మంచి కామెడీ అందించే పృథ్వీ ఇంట్లోనే ఉండిపోతున్నాడు పాపం.