వైరల్ అవుతున్న పృథ్వీ రాసలీలల టేప్

Published on Jan 13,2020 04:39 PM

నటుడు 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ రాసలీలల టేప్ వైరల్ అవుతోంది. ఎస్వీ బిసి చైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పృథ్వీ తన ఛానల్ లో పనిచేస్తున్న ఓ మహిళతో సరస సంభాషణ సాగిస్తున్న టేప్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ టేప్ తనది కాదని , నన్ను తొక్కాలని ఇలా కుట్ర చేసారని ఇందుకోసం ఎలాంటి విచారణ కైనా నేను సిద్దమే అని ప్రకటించాడు పృథ్వీ. ఇక టీవీ ఛానల్ లలో అయితే ఇదే గోల అయ్యింది నిన్న అంతా. నేను ఏ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని నన్ను రాజకీయంగా అణగదొక్కదానికే ఇంత కుట్ర చేసారని అది కూడా చంద్రబాబు చేయించాడని ఆరోపిస్తున్నాడు పృథ్వీ.

జగన్ ఏపీ లో అధికారంలోకి వచ్చాక గత జులై లో పృథ్వీ ని ఎస్వీ బిసి చైర్మన్ ని చేసాడు. దాంతో అప్పటి నుండి తిరుమల లోనే ఎక్కువ కాలం ఉంటున్న పృథ్వీ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కున్నాడు. ఇక ఇపుడేమో నేను అసభ్యంగా ప్రవర్తించలేదు , ఎలాంటి విచారణకైనా సిద్దమే అని అంటున్నాడు పాపం. తీవ్ర ఆరోపణలు రావడంతో చైర్మన్ పదవికి రాజీనామా చేయమని జగన్ ఆదేశాలు జారీ చేయడంతో ఎస్వీ బిసి చైర్మన్ పదవికి రాజీనామా చేసాడు పృథ్వీ.