మహేష్ బాబు పై దుష్ప్రచారం

Published on Dec 28,2019 11:54 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై యాంటీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏంటో తెలుసా ........ మహేష్ బాబు తో ఫోటో దిగడానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ని పిలిచిన విషయం తెలిసిందే. ఆ ఆహ్వానానికి ఒక్కొక్కరి నుండి 500 రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు తీసుకున్నట్లు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు మహేష్ బాబు అంటే గిట్టని వాళ్ళు. అల్యుమియం ఫ్యాక్టరీ లో మహేష్ బాబు తో ఫోటో సెషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు దాంతో ఆ కార్యక్రమం మొత్తం రచ్చ రచ్చ అయ్యింది.

బౌన్సర్ లతో దాడులు జరగడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. దాంతో మహేష్ యాంటీ  ఫ్యాన్స్ దీన్ని చక్కగా మలుచుకొని దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. డబ్బులు తీసుకొని అభిమానులను మోసం చేసారని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ప్రమాదం కాబట్టి దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఆ చిత్ర యూనిట్ పై ఎంతైనా ఉంది. సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న విడుదల కానుంది మరి.