రజనీకాంత్ ని ఘోరంగా అవమానించాడట ఆ నిర్మాత

Published on Dec 09,2019 02:37 PM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఓ తమిళ నిర్మాత ఘోరంగా అవమానించాడట. ఈ విషయాన్నీ రజనీకాంత్ స్వయంగా వెల్లడించడం విశేషం. నిన్న చెన్నై లో దర్బార్ చిత్ర ఆడియో వేడుక జరిగింది. కాగా ఆ వేడుకలో పాల్గొన్న రజనీకాంత్ తన తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన ని గురించి చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేసాడు. ఓ సినిమాలో నటించడానికి 6 వేల రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారట అయితే ముందుగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తామన్నారట కానీ ఇవ్వలేదు.

షూటింగ్ అని లొకేషన్ కు కూడా తీసుకెళ్లారట , అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో మేనేజర్ ని అడిగాడట రజనీ , ఇంకేముంది ఇదే విషయాన్నీ ఆ మేనేజర్ సదరు నిర్మాతకు చెప్పడంతో ఆవేశంతో ఊగిపోయాడట ! వెంటనే రజనీకాంత్ ని అదే సెట్ లో ఘోరంగా అవమానిస్తూ నిన్ను మా సినిమాలోంచి తీసేసాను ఇక్కడి నుండి వెళ్ళిపో అని గట్టిగా అన్నాడట ! దాంతో అవమానభారంతో బయటకు నడుచుకుంటూ వచ్చిన రజనీ ఎలాగైనా సరే స్టార్ ని కావాలని కసిగా నిర్ణయం తీసుకున్నాడట. కట్ చేస్తే కొద్దిరోజుల్లోనే తమిళనాట మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇంత ఘోరంగా అవమానించిన నిర్మాత పేరు మాత్రం వెల్లడించలేదు రజనీకాంత్.