రూమర్స్ అంటూ కొట్టిపడేసాడు

Published on Oct 31,2019 04:56 PM

బాలయ్య తన రెమ్యునరేషన్ ని బాగా పెంచాడని , అలాగే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబడుతున్నాడని వార్తలు బాగా స్ప్రెడ్ కావడంతో ఈ వార్తలు నిర్మాత సి. కళ్యాణ్ చెవిన పడ్డాయి దాంతో అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపడేసాడు. బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో పట్టుబట్టే వ్యక్తి కాదని , పైగా నేను ఆయనతో ఇంతకుముందు కూడా సినిమాలు చేసానని ..... మా సినిమా అనుకున్న విధంగా డిసెంబర్ 20 న విడుదల అవుతుందని స్పష్టం చేసాడు నిర్మాత సి. కళ్యాణ్.

బాలయ్య హీరోగా ఇంతకుముందు పరమవీర చక్ర , జై సింహా చిత్రాలను నిర్మించాడు సి. కళ్యాణ్. ఇక ఇప్పుడేమో మళ్ళీ కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాంతో ఈ సినిమా కోసం బాలయ్య 14 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో స్పందించాడు నిర్మాత.