తమిళంలో ఛాన్స్ కొట్టేసిన ప్రియాంకా జవాల్కర్

Published on Jan 13,2020 04:50 PM

విజయ్ దేవరకొండ సరసన టాక్సీ వాలా చిత్రంలో నటించి హిట్ కొట్టిన అనంతపురం భామ ప్రియాంకా జవాల్కర్ కు తాజాగా తమిళంలో మంచి ఛాన్స్ లభించిందట ! తమిళ హీరో సిద్దార్థ్ సరసన నటించే ఛాన్స్ ఈ భామని వరించిందట. సిద్దార్థ్ హీరోగా నటించనున్న చిత్రంలో ఇద్దరు హీరోయిన్ లుండగా అందులో ఒక హీరోయిన్ గా నివేదా థామస్ ని ఎంపిక చేసారు ఇక రెండో హీరోయిన్ గా ప్రియాంకా జవాల్కర్ ని ఎంపిక చేశారట. నివేదా కు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాగా ప్రియాంకా జవాల్కర్ ది మాత్రం గ్లామర్ పాత్ర అంట.

అసలే గ్లామర్ భామ ఆపై రొమాంటిక్ పాత్ర అంటే వీర లెవల్లో రెచ్చిపోవడమే ! అలాగే అందాల ప్రదర్శనకు ఎలాంటి అభ్యంతరం లేదని కరాఖండిగా చెప్పిందట కూడా. ఈ మాట చాలు అటు కుర్రాళ్లకు ఇటు దర్శక నిర్మాతలకు. టాక్సీ వాలా మంచి హిట్ అయ్యింది కానీ ఏ భామకు మాత్రం ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు దాంతో మంచి ఛాన్స్ ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో సిద్దార్థ్ సరసన నటించే ఛాన్స్ లభించింది.