నక్సలైట్ పాత్రలో ప్రియమణి

Published on Apr 29,2020 05:50 PM
సీనియర్ హీరోయిన్ ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం చిత్రంలో నక్సలైట్ గా నటిస్తోంది. యువ దర్శకులు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు , ఇక ప్రియమణి నక్సలైట్ గా నటిస్తోంది. సాయి పల్లవి రానా సరసన నటిస్తోంది. అలాగే కీలక పాత్రలో నందితా దాస్ కూడా నటిస్తోంది ఈ చిత్రంలో.

ఇప్పటికే రెండు షెడ్యూల్ లను పూర్తిచేసుకున్న విరాటపర్వం పోలీస్ - నక్సల్స్ మధ్య సాగే పోరాట నేపథ్యములో రూపొందుతోంది. ప్రియమణికి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్ర లభించిందనే చెప్పొచ్చు ఎందుకంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఖాయం. గతంలో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది ప్రియమణి. ఒకవైపు గ్లామర్ పాత్రలను పోషిస్తునే మరోవైపు సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలా తుపాకీ చేయబడుతోంది విరాటపర్వం కోసం.