నాని ని రిజెక్ట్ చేసిన మలయాళ భామ

Published on Feb 09,2019 11:39 AM

హీరో నాని చిత్రంలో నటించే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు కానీ ఓ మలయాళ భామ మాత్రం నాని సినిమాలో నటించాలని ఆఫర్ ఇస్తే నిర్మొహమాటంగా ఆ ఆఫర్ ని తిరస్కరించింది . ఇంతకీ నాని సినిమాని రిజెక్ట్ చేసిన భామ ఎవరో తెలుసా ..... ఎందుకు చేసిందో తెలుసా ...... వింక్ గర్ల్ గా పేరుపొందిన ప్రియా ప్రకాష్ వారియర్ . ఇక నాని సరసన కాకుండా నాని కి చెల్లిగా నటించమని ఆఫర్ ఇచ్చారట దాంతో నో చెప్పేసింది ఈ భామ . 

కన్ను గీటుతూ యావత్ భారతాన్ని ఓ ఊపు ఊపేసిన భామ ప్రియా ప్రకాష్ వారియర్ . మలయాళ చిత్రంలో నటిస్తున్న ఈ భామ కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు దాంతో తెలుగు సినిమాలో నటించేలా ప్లాన్ చేసారు కానీ హీరోయిన్ గా కాకుండా సైడ్ క్యారెక్టర్ కావడంతో నో చెప్పింది .