సినీ ప్రముఖుల చేతుల మీదుగా `ప్రేమ పిపాసి ` మోషన్ పోస్టర్ లాంచ్

Published on Sep 18,2019 02:42 PM
సినీ ప్రముఖుల చేతుల మీదుగా `ప్రేమ పిపాసి ` మోషన్ పోస్టర్ లాంచ్ 
ఎస్ఎస్ ఆర్ట్  ప్రొడ‌క్ష‌న్స్  పతాకం పై  రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గ‌శ్రీ ఫిలింస్ తో కలిసి  పి.ఎస్.రామ‌కృష్ణ(ఆర్‌.కె) నిర్మిస్తోన్న చిత్రం  `ప్రేమ పిపాసి` ( సెర్చింగ్ ఫ‌ర్ ట్రూ ల‌వ్ అనేది ట్యాగ్ లైన్).    ముర‌ళి రామస్వామి అనే నూత‌న  ద‌ర్శ‌కుడు ఈ  చిత్రాన్ని డైర‌క్ట్ చేస్తున్నారు. జిపిఎస్,  క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సోనాక్షి వ‌ర్మ, మౌని, మ‌మ‌త‌శ్రీ చౌద‌రి ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో, సుమ‌న్ కీల‌క‌పాత్ర‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని ఈ శుక్రవారం శిల్పకళావేదిక లో ప్రముఖ సీనియర్ నటి జమున, సహజ నటి జయసుధ,  నటుడు బాబు మోహన్, నిర్మాతలు  సి. కళ్యాణ్ , అంబటి రామకృష్ణ చేతుల మీదుగా లాంచ్ చేసారు. ఈ కార్యాక్రమం లో పాల్గొన్న సినీ ప్రముఖులు   `` ప్రేమ పిపాసి ` మోషన్ పోస్టర్` టైటిల్  చాలా బావుందంటూ... ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని  ఆకాక్షించారు. 
నిర్మాత మాట్లాడుతూ...``శిల్పకళావేదిక లో `వెండి తెర` అవార్డ్స్ లో మా సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన విష్ణు గారికి ధన్యవాదాలు. అలాగే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సీనియర్ నటి   జమున, సహజ నటి జయసుధ,  నటుడు బాబు మోహన్, నిర్మాత లు  సి. కళ్యాణ్ , అంబటి రామకృష్ణ గార్లకు కృతఙ్ఞతలు. సినిమా అనుకున్న విధంగా వచ్చింది. త్వరలో ఆడియో తో పాటు టీజర్ రిలీజ్ చేయడాని ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు. 
చిత్ర ద‌ర్శ‌కుడు ముర‌ళి రామ‌స్వామి మాట్లాడుతూ...`` మా సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన జమున, జయసుధ, బాబూమోహన్ , సి. కళ్యాణ్ , అంబటి గార్లకు ధన్యవాదాలు. ఇప్పటికే సినిమా డబ్బింగ్ పూర్తయింది. ఆర్. ఆర్ జరుగుతోంది. త్వరలో టీజర్ లాంచ్ చేస్తాం. ఇక సిసినిమా స్టోరీ విషయానికొస్తే ...  ల‌వ్ , రొమాన్స్, కామెడీ తో పాటు యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్  గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. మ్యూజిక్ కి స్కోపున్న సినిమా. ప్ర‌తి క్యార‌క్ట‌ర్ ఎంతో నేచ‌ర‌ల్ గా బిహేవ్ చేస్తూ ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట‌య్యేలా ట్రెండీగా ఉంటుంది``అన్నారు. 
ఇంకా ఈ కార్యక్రమం లో హీరో జిపిఎస్,  హీరోయిన్  క‌పిలాక్షి మ‌ల్హోత్రా మరియు చిత్ర టీం పాల్గొన్నారు. 

 ఫ‌న్ బకెట్ భార్గ‌వ్, షేకింగ్ శేషు, జ‌బ‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, ఫ‌స‌క్ శ‌శి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ః తిరుమ‌ల రోడ్రిగ్జ్; మ్యూజిక్ : ఆర్స్ ;  పాట‌లుః సురేష్ ఉపాధ్యాయ‌; ఎడిట‌ర్ః ఎస్ .జె. శివ కిర‌ణ్‌;  ఫైట్స్ :  మిస్టర్  దేవ్;  కో-ప్రొడ్యూస‌ర్స్ః రాహుల్ పండిట్, జియ‌స్ రావ్;  వై. వెంక‌ట‌ల‌క్ష్మి;  ప్రొడ్యూసర్  పి.య‌స్.రామ‌కృష్ణ‌(ఆర్‌.కె);  డైర‌క్ట‌ర్ః ముర‌ళి రామ‌స్వామి.