సినిమా ప్రమోషన్ లో గొడవ

Published on Dec 09,2019 07:51 PM

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతీరోజూ పండగే చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా జరుగుతున్న ప్రమోషనల్ కార్యక్రమాల్లో గొడవ జరిగింది దాంతో అభిమానులతో పాటుగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఇబ్బందిపడ్డారు. ఈ సంఘటన గుంటూరు లో జరిగింది. ప్రతీరోజూ పండగే చిత్రం ఈనెల 20 న విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్ నిమిత్తం గుంటూరు వెళ్లారు. గుంటూరు భాస్కర్ ప్యాలెస్ లో సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా వస్తున్న విషయం తెలియడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

వాళ్ళని అదుపు చేయడంలో బౌన్సర్ లు విఫలం కావడమే కాకుండా ఇతరులపై చేయి చేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు మీదకు రావడంతో పెద్ద గొడవే అయ్యింది అక్కడ. అయితే కొంతసేపటి తర్వాత పరిస్థితులు సద్దుమణగడంతో కార్యక్రమాన్ని మమ అనిపించారు.