15 కోట్లు వసూల్ చేసిన ప్రతి రోజూ పండగే

Published on Dec 23,2019 09:09 AM

సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజూ పండగే రెండు రోజుల్లో 15 కోట్ల వసూళ్ళని సాధించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల వసూళ్ళని సాధించగా రెండో రోజున 7 కోట్ల వసూళ్ల ని సాధించింది దాంతో రెండు రోజుల్లో 15 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించినట్లయింది. అయితే ప్రతి రోజూ పండగే చిత్రం ఓవర్ సీస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టడం లేదు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఓ మాదిరిగా వసూళ్లని సాధిస్తోంది. రెండు రోజుల్లో మంచి గ్రాస్ నే సాధించింది ఇక ఈరోజు ఆదివారం కావడంతో తప్పకుండా మంచి కలెక్షన్స్ రావడం ఖాయం అయితే రేపటి నుండి అసలు పరీక్ష ఎదురుకానుంది సాయిధరమ్ తేజ్ కు. శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమాని తలపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి ఈ సినిమా మీద. అయితే వెంకీ మామ తప్ప మరో సినిమా మెగా మేనల్లుడుకి పోటీ లేదు కాబట్టి మంచి కలెక్షన్స్ సాధిస్తుందేమో చూడాలి.