8 కోట్లు వసూల్ చేసిన ప్రతి రోజూ పండగే

Published on Dec 22,2019 09:23 AM

సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజూ పండగే నిన్న విడుదలైన సంగతి తెల్సిందే. కాగా ఆ సినిమా నిన్న 8 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటించగా సత్యరాజ్ కీలక పాత్రలో నటించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ , ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయనే చెప్పాలి. సాయిధరమ్ తేజ్ సినిమాలకు పెద్దగా ఓపెనింగ్స్ లేని సమయంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజునే 8 కోట్ల వసూళ్లు చేయడం అంటే మాములు విషయం కాదు.

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈరోజు రేపు మాత్రమే ప్రభావం చూపించనుంది. ఆ తర్వాత ప్రతి రోజూ పండగే చిత్రానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అయితే మెప్పించడం కష్టమే అని అంటున్నారు. అయితే గుడ్డిలో మెల్ల లాగా సాయి కిది మంచి సినిమా అనే చెప్పాలి. డిజాస్టర్ , ప్లాప్ సినిమా అయితే కాదు కానీ పక్కా హిట్ సినిమా మాత్రం కాదన్నమాట.