సినిమావాళ్ళ పై మండిపడుతున్న ప్రకాష్ రాజ్

Published on Dec 21,2019 09:29 AM

నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వీలు చిక్కినప్పుడల్లా తీవ్ర విమర్శలు చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి మోడీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డాడు అంతేకాదు పనిలో పనిగా మోడీ నిరంకుశ విధానాలను ప్రశ్నించకుండా సైలెంట్ గా ఉంటున్న సినీ ప్రముఖులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. తాజాగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు ని తీసుకురావడంతో మైనారిటీలు ముఖ్యంగా ముస్లిం లు తీవ్ర ఆందోళన చేస్తున్నారు దేశవ్యాప్తంగా దాంతో మరోసారి నిప్పులు కక్కాడు ప్రకాష్ రాజ్.

మోడీ పెద్ద నోట్లను రద్దు చేసినట్లుగానే మనుషులను కూడా రద్దు చేస్తున్న ఇలాంటి క్రైం మినిష్టర్ లను చరిత్ర మర్చిపోవచ్చు కానీ మౌనంగా ఉంటున్న మన వాళ్ళని చరిత్ర క్షమించదు అంటూ ట్వీట్ చేసాడు ప్రకాష్ రాజ్. మోడీ - అమిత్ షా తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు పై దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. అయితే సినిమావాళ్లు మాత్రం ఈ బిల్లు పై పెద్దగా స్పందించడం లేదు దాంతో ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. గతకొంత కాలంగా మోడీ , బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు ప్రకాష్ రాజ్.