ప్రకాష్ రాజ్ ఆ నటిని తిట్టాడట

Published on Oct 26,2019 03:43 PM

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద నటుడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వివాదాలు ప్రకాష్ రాజ్ ని చుట్టుముట్టాయి. అంతేకాదు చేస్తున్న ప్రతీ సినిమాలో ప్రకాష్ రాజ్ ఆయా దర్శక నిర్మాతలను లేదంటే ఇతర నటీనటులను ఇబ్బందులకు గురి చేస్తుంటాడు అనే పేరుంది అయినప్పటికీ తమ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉండి తీరాలి అని పట్టుబట్టే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు.
       తాజాగా ప్రకాష్ రాజ్ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రూలర్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే భూమిక కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ ముగ్గురి మధ్య ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో భూమిక సరిగ్గా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేదని ప్రకాష్ రాజ్ గట్టిగా అరిచాడట దాంతో షాక్ అయిన యూనిట్ వర్గాలు ప్రకాష్ రాజ్ దే తప్పని అంటున్నారట. భూమిక ప్రకాష్ రాజ్ పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉందట. ప్రకాష్ రాజ్ తాను మాత్రమే గొప్ప నటుడు అని ఫీల్ అవుతుంటాడని అంత అహంకారం మంచిది కాదని అంటున్నారు.