పవన్ కళ్యాణ్ సరసన ప్రగ్యా జైస్వాల్

Published on Jan 25,2020 08:10 PM

కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన భామ ప్రగ్యా జైస్వాల్ కు గోల్డెన్ ఛాన్స్ లభించింది. ఈ భామకు ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తాజాగా క్రిష్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో పవన్ దొంగగా నటించనున్నాడు. ఇక ఆ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందా ? అన్న ఆలోచన చేయగా చివరకు ప్రగ్యా జైస్వాల్ దగ్గర ఆగిపోయాయట చూపులు.

కంచె చిత్రంలో  ప్రగ్యా జైస్వాల్ ని అందంగా చూపించాడు క్రిష్. ఆ సినిమాకు మంచి పేరు వచ్చినప్పటికీ ఈ భామకు మాత్రం అంతగా ఛాన్స్ లు రాలేదు పాపం. దాంతో వచ్చిన చిన్నా చితకా వేషాలు వేసుకుంటూ కాలం వెళ్లదీసింది. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ రూపంలో బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది ప్రగ్యా జైస్వాల్ కు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు కాగా ఆ సినిమా కంప్లీట్ అయ్యాక క్రిష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.