ప్రదీప్ ఆశలపై నీళ్లు చల్లిన కరోనా !

Published on Mar 29,2020 05:16 PM
యాంకర్ ప్రదీప్ ఆశలపై నీళ్లు చల్లింది కరోనా వైరస్. కరోనా ఏంటి ? ప్రదీప్ ఆశలపై నీళ్లు చల్లడం ఏంటి ? అని అనుకుంటున్నారా ?బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న యాంకర్ ప్రదీప్ హీరోగా ఓ వెలుగు వెలగాలని వెండితెర మీద పెద్ద సాహసమే చేసాడు '' 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? '' అనే సినిమాతో. ఆ సినిమా అనుకున్నట్లుగా సజావుగా సాగితే ఈపాటికి విడుదల అయ్యేది , అది ఎలాంటి ఫలితాన్ని పొందేదో తెలిసేది కూడా.

కానీ ప్రదీప్ ఆశలపై నీళ్లు చల్లింది కరోనా అనే మహమ్మారి. కరోనా ఎఫెక్ట్ తో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రం విడుదల ఆగిపోయింది. మరో రెండు మూడు నెలలు అయినా సరే దేశంలో తేలిక పడే పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చినా సరే మరో నాలుగయిదు నెలల పాటు సినిమా థియేటర్ ల మొహం చూసే ప్రేక్షకులు ఉండరు. దాంతో ప్రదీప్ సినిమా విడుదల అవ్వడం కష్టమే ! ఒకవేళ రిలీజ్ అయినా దాన్ని పట్టించుకునే స్థితిలో అప్పుడు ప్రజలు ఉంటారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న పాపం.