కేజీఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్

Published on Nov 19,2019 09:55 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో  కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ చిత్రం చేయాలనే ఆలోచన చేస్తున్నాడట అందుకే ప్రభాస్ ని కలిసి ఓ కథ కూడా చెప్పాడట. ప్రభాస్ రేంజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తం అయ్యింది దాంతో అతడితో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు పలువురు దర్శకులు. అందులో ప్రశాంత్ నీల్ కూడా చేరాడు. గత ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన '' కేజీఎఫ్ '' దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నడ హీరో యష్ ని నేషనల్ స్టార్ ని చేసింది దాంతో ప్రశాంత్ నీల్ పేరు బాగా మారుమ్రోగుతోంది.

ప్రశాంత్ నీల్ మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ లతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ ముగ్గురు టాలీవుడ్ హీరోలను కలిసాడు కూడా. అయితే ఇందులో ప్రభాస్ ఛాన్స్ ఇస్తాడా ? మహేష్ బాబు ఇస్తాడా ? లేక జూనియర్ ఎన్టీఆర్ ? ఎవరు అన్నది మాత్రం కొద్దిరోజులు ఆగితే కానీ తెలీదు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రం చేస్తుండగా ప్రభాస్ జాన్ చిత్రం చేస్తున్నాడు.