కరోనా ఎఫెక్ట్ : మాస్క్ ధరించిన ప్రభాస్

Published on Mar 04,2020 04:05 PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దాంతో పలువురు సెలబ్రిటీలు సైతం వణికిపోతున్నారు. ఇక కరోనా ఎఫెక్ట్ తో మాస్క్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తాజాగా డార్లింగ్ ప్రభాస్ కూడా ముఖానికి మాస్క్ ధరించి కనిపించి షాక్ ఇచ్చాడు. ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ప్రభాస్ ముఖానికి మాస్క్ ధరించి ఉండటంతో ఇక దాన్ని కొంతమంది వీడీయో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో.

ప్రభాస్ మాస్క్ ధరించి ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న వీడియో చూస్తే తెలుస్తుంది కరోనా వైరస్ తో ఎంతమంది భయపడుతున్నారో. ఇప్పటికే చైనాని పట్టిపీడిస్తున్న కరోనా ఇప్పుడు మన దేశంలోకి కూడా ఎంటర్ అయ్యింది. పైగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళు నమోదు కావడంతో పాటు పెద్ద ఎత్తున అనుమానితులు నమోదు అవుతున్నారు దాంతో అందరూ మాస్క్ లను ధరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.