500 కోట్ల భారీ బడ్జెట్ తో రిస్క్ చేస్తున్న ప్రభాస్

Published on Apr 22,2020 10:31 AM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించనున్నారట. 500 కోట్లతో పాన్ వరల్డ్ సినిమాగా దాన్ని రూపొందించడానికి భారీ సన్నాహాలు చేస్తున్నాడట నాగ్ అశ్విన్. ఇక గ్రాఫిక్ వర్క్ కె ఏకంగా 50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారట దాంతో ఇంత పెద్ద బడ్జెట్ వర్కౌట్ అవుతుందా ? అన్న అనుమానం నెలకొంది.

ఇంతగా అనుమానం ఎందుకో తెలుసా ........ కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. అంతటా కూడా లాక్ డౌన్ ఉంది. కరోనా తగ్గుముఖం పట్టేది ఎప్పుడు ? సాధారణ పరిస్థితులు నెలకొనేది ఎప్పడు ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. షూటింగ్ లన్నీ ఆగిపోయాయి అలాగే థియేటర్ లు ఎప్పుడు తెరుస్తారో ? తెరిచినా జనాలు వస్తారో రారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రభాస్ తో 500 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా అంటే రిస్క్ అనే చెప్పాలి.