భయంతో ఇండియాకు తిరిగి వచ్చిన ప్రభాస్

Published on Sep 03,2019 12:12 PM
ప్రభాస్ నటించిన సాహో భారీ అంచనాల మధ్య విడుదలై సంచలన విజయం సాధిస్తుందని అనుకుంటే దిమ్మతిరిగేలా డిజాస్టర్ టాక్ రావడంతో ఫారిన్ వెళ్లి సేద తీరుదామనుకున్న ప్రభాస్ ప్లాప్ టాక్ రావడంతో కంగారు పడి తిరిగి ఇండియాకు వచ్చేసాడు. బయ్యర్లు పోటీ పడి ఈ సినిమాని కొన్నారు దాంతో సాహో డిజాస్టర్ అయితే సాహో ని కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడం ఖాయం అందుకే ప్రభాస్ భయపడిపోయి ఇండియాకు తిరిగి వచ్చాడట. 

సాహో కోసం భారీ ఎత్తున ప్రమోషన్ లు చేయాలనీ భావిస్తున్నాడు ప్రభాస్. అయితే నాలుగు రోజుల పాటు భారీగానే వసూళ్లు వచ్చాయి కానీ ఈరోజు నుండి అసలైన పరీక్ష సాహో కు మొదలుకానుంది. సాహో పై భారీ అంచనాలున్న నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి అయితే ఈరోజు నుండి కలెక్షన్స్ డ్రాప్ కానున్నాయి. సాహో డిజాస్టర్ అయితే తన స్నేహితులకు ఇబ్బంది కాబట్టి ఫారిన్ వెళ్లిన ప్రభాస్ తిరిగి ఇండియాకు వచ్చాడు.