భయంతోనే జార్జియా వెళ్లిన ప్రభాస్ - పూజా

Published on Mar 15,2020 02:31 PM
కరోనా భయంతోనే జార్జియా వెళ్లారు హీరో ప్రభాస్ హీరోయిన్ పూజా హెగ్డే లు. తాజాగా ఈ ఇద్దరూ ఓ డియర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ - గోపికృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా షెడ్యూల్ జార్జియా లో జరుగుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ భయంతో వణికిపోతోంది ప్రపంచమంతా.

అయితే అంతటి భయంలో కూడా షూటింగ్ కోసం జార్జియా వెళ్ళాడు ప్రభాస్ అలాగే హీరోయిన్ పూజా హెగ్డే లు. అయితే ఒకవైపు భయం వెంటాడుతున్నప్పటికీ మరోవైపు జాగ్రత్తలు తీసుకొని మరీ వెళ్లారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా భయం మాత్రం వెంటాడుతూనే ఉంది వీళ్ళని. ప్రభాస్ జార్జియా వెళ్లాడని తెలుసుకున్న అభిమానులు భయపడుతున్నారు.