జార్జియా వెళ్లిన ప్రభాస్ - పూజా హెగ్డే

Published on Mar 10,2020 08:20 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే లు జార్జియా వెళ్లారు. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటుగా రొమాంటిక్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారట. జార్జియా షెడ్యూల్ ఏకంగా 20 రోజుల పాటు కొనసాగనుంది. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకొని ఈ టూర్ కి వెళ్తున్నారట. కరోనా వీర లెవల్లో విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభాస్ తో పాటుగా పూజా హెగ్డే పెద్ద సాహసమే చేస్తున్నారు.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాహో తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటున్నారు యువి క్రియేషన్స్ అధినేతలు. జార్జియా నుండి వచ్చాక మళ్ళీ హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ వరల్డ్ వైడ్ రేంజ్ కి చేరుకున్న సంగతి తెలిసిందే.