1970 నాటి కథతో ప్రభాస్ సినిమా

Published on Apr 02,2019 01:18 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రెండు చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . ఒకటేమో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో కాగా మరొకటి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ చిత్రం . ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్ లతో రూపొందుతున్నాయి . ఇక జాన్ చిత్ర విషయానికి వస్తే అది ఇప్పటి కథ కాదు 1970 నాటి కథ అందునా యూరప్ కి చెందిన ప్రేమ కథ గా రూపొందుతోంది . 

ఈ సినిమా కోసం ఏకంగా 80 కోట్లతో పలు సెట్స్ వేశారు , ఇంకా వేస్తున్నారు . కేవలం సెట్టింగ్ లకోసమే 80 కోట్లు ఖర్చుపెడుతున్నారు . యూరప్ లో కొంత శాతం షూటింగ్ చేసి మిగదంతా ఇక్కడ సెట్ లో పూర్తిచేస్తారు . ప్రభాస్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తోంది . ఇక ఈ చిత్రాన్ని పెద్దనాన్న కృష్ణంరాజు తో కలిసి ప్రభాస్ మిత్రులైన యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు .