కరోనా భయంతో ఆగిపోయిన ప్రభాస్ సినిమా

Published on Mar 10,2020 11:18 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ) అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ ఆస్ట్రేలియాలో చేయాల్సి ఉండే. ఆ మేరకు ఆస్ట్రేలియా కు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు షెడ్యూల్ కూడా ప్లాన్ చేసుకున్నారు కట్ చేస్తే కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయపెడుతుండటంతో ఆస్ట్రేలియా టూర్  క్యాన్సిల్ చేసారు ప్రభాస్ అండ్ కో.

ఆస్ట్రేలియా కు బదులుగా ఇక్కడే హైదరాబాద్ లో సెట్టింగ్స్ వేసి షూటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇప్పట్లో కరోనా తగ్గేలా కనిపించడం లేదు కాబట్టి రోజురోజుకి ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి రిస్క్ చేయడం తగదని ఈ నిర్ణయానికి వచ్చారట చిత్ర బృందం. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. సాహో తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న భారీ చిత్రం కావడంతో అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు ఈ చిత్రం మీద.