అక్టోబర్ 23 న రిలీజ్ కానున్న ప్రభాస్ సినిమా

Published on Feb 28,2020 02:52 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఓ డియర్ , జాన్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 23 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కొంతకాలంగా ఈ సినిమాకు సంబందించిన ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

అయితే ఇలాంటి సమయంలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో భారీ సినిమాని అనౌన్స్ చేసి సంతోషంలో ముంచెత్తారు. కట్ చేస్తే కొత్త సినిమా రిలీజ్ డేట్ ని కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారట ఈ చిత్ర బృందం. ప్రభాస్ ని డార్లింగ్ గా చూపించే చిత్రమని తప్పకుండా సూపర్ హిట్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాధాకృష్ణ దర్శకత్వం వహించిన జిల్ ఆశించిన స్థాయిలో ఆడలేదు మరి ఈ సినిమా ఏమౌతుందో చూడాలి.