మహేష్ బాబు థియేటర్ లో ప్రభాస్

Published on Sep 10,2019 11:36 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులతో కలిసి సాహూ చిత్రాన్ని చూసాడు అది కూడా మహేష్ బాబు థియేటర్ లో. గచ్చిబౌలి - మాదాపూర్ ఏరియాలో మహేష్ బాబు కి ఏ ఎం బి అనే మాల్ ఉన్న విషయం తెలిసిందే. అందులోఅధునాతనమైన థియేటర్ లు కూడా ఉన్నాయి. దాంతో తన అభిమానులతో కలిసి ప్రభాస్ సాహో చిత్రాన్ని వీక్షించాడు. ఆగస్టు 30 న విడుదలైన సాహో భారీ వసూళ్లు సాధించినప్పటికీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం విదితమే!
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో విజయం పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఆ చిత్రానికి మరింతగా ప్రాచుర్యం కల్పించడానికి మేకింగ్ వీడియో వదిలారు అలాగే ప్రభాస్ తన అభిమానులతో కలిసి సినిమా చూసాడు. ఇలా చేయడం వల్ల సినిమాకు ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు అయితే ఆ దాఖలాలు లేవు పాపం.