చిరంజీవి సినిమాని తన్నుకుపోయిన ప్రభాస్

Published on Feb 28,2020 02:53 PM

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ప్రకటించిన చిత్రంలో అసలు హీరోగా ఎవరు నటించాలో తెలుసా ........ ఇంకెవరు ........  మెగాస్టార్ చిరంజీవి. అవును మెగాస్టార్ చిరంజీవికి వైజయంతి మూవీస్ కు అవినాభావ సంబంధం ఉంది. మెగాస్టార్ హీరోగా నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలు వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. అంతేకాదు మహానటి తీసిన సందర్బంగా నాగ్ అశ్విన్ ని అభినందిస్తూనే నాకు సైన్స్ ఫిక్షన్ లైన్ చెప్పాడని దాన్ని డెవలప్ చేయమన్నానని కూడా చెప్పాడు చిరు.

అయితే ఈమద్యలో ఏమయ్యిందో ఏమో కానీ చిరంజీవి కాకుండా ప్రభాస్ వచ్చి చేరాడు వైజయంతి మూవీస్ ప్రకటించిన కొత్త చిత్రంలో. ఇది కూడా సైన్స్ ఫిక్షన్ కథ కావడంతో చిరంజీవి సినిమాని ప్రభాస్ తన్నుకుపోయాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రభాస్ రేంజ్ ఇప్పుడు వేరే లెవల్ లో ఉంది పైగా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ప్రభాస్ తో వెళ్లాలని అనుకున్నట్లున్నారు. అలాగే చిరు కూడా బిజీ గా ఉన్నాడు.