దుబాయ్ లో సినిమా చూడనున్న ప్రభాస్

Published on Aug 30,2019 10:40 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో దుబాయ్ లోనిన్న విడుదల అయ్యింది  , దాంతో దుబాయ్ లో సాహో చిత్రాన్ని చూడటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు ప్రభాస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం పై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. సినిమా ఆగస్టు 30 న విడుదల అవుతుండగా దుబాయ్ లో మాత్రం ఒకరోజు ముందుగానే విడుదల అయ్యింది. 
ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం ముంబై , చెన్నై , బెంగుళూర్ , హైదరాబాద్ ఇలా చాలా పట్టణాలనే కవర్ చేసాడు ప్రభాస్. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రభాస్ రెండేళ్ల పాటు సాహో కోసం పడినకష్టంతో అలసిపోయి ఉన్నాడు దాంతో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవడానికి సిద్దమయ్యాడు అందుకే దుబాయ్ వెళ్లి అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూసి అక్కడి నుండి అటే మరో చోటికి వెళ్లి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు.