జాన్ టైటిల్ ని వదులుకుంటున్న ప్రభాస్

Published on Mar 12,2020 06:03 PM
జాన్ టైటిల్ ని వదులుకుంటున్న ప్రభాస్

సమంత - శర్వానంద్ జంటగా నటించిన జాను చిత్రం డిజాస్టర్ కావడంతో తన సినిమా టైటిల్ జాన్ ని వదులుకోవడానికి డిసైడ్ అయ్యారట ప్రభాస్ అండ్ కో. తాజాగా ప్రభాస్ జిల్ ఫేమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి జాన్ అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టుకున్నారు. అయితే దిల్ రాజు సమంత - శర్వానంద్ లతో తీసిన సినిమా కోసం జాను అనే టైటిల్ ని పెట్టారు. దాంతో అప్పుడే మన టైటిల్ ఉంచాలా ? తీసెయ్యాలా ?అనే డైలమాలో పడ్డారు.

కట్ చేస్తే జాను చిత్రం విడుదల అయ్యింది డిజాస్టర్ అయ్యింది దాంతో జాన్ అనే వర్కింగ్ టైటిల్ ని వదులుకోవాలని అనుకున్నారట. ఇప్పటికే ఈ సినిమా కోసం రెండు టైటిల్ లను రిజిస్టర్ చేయించారు. త్వరలోనే ఆ టైటిల్ ని ఖరారు చేసి ఉగాది కానుకగా ప్రబస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు