భక్త కన్నప్ప చేస్తానంటున్న ప్రభాస్

Published on Aug 27,2019 11:12 AM

పెదనాన్న చేసిన భక్త కన్నప్ప ఓ క్లాసికల్ చిత్రం అయితే అలాంటి క్లాసికల్ ని టచ్ చేయలేము కానీ నేను భక్త కన్నప్పగా నటించాలనేది పెద్దనాన్న కోరిక కాబట్టి తప్పకుండా ఆ సినిమా చేస్తానని అంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  ఈ హీరో నటించిన సాహో విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు , ఆ సందర్బంగా భక్త కన్నప్ప గురించి మాట్లాడాడు ప్రభాస్. 

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. దాంతో ఆ సినిమాని ప్రభాస్ తో తీయాలని కృష్ణంరాజు ఎప్పటినుండో అనుకుంటున్నాడు, కానీ కుదరడం లేదు ఇప్పుడేమో ప్రభాస్ భారీ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు మరి. సాహో విడుదల అయ్యాక జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే చిత్రం చేయనున్నాడు, ఆల్రెడీ జాన్ చిత్రం 20 రోజుల షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక ఈ భక్త కన్నప్ప ఎప్పుడు చేస్తాడో మరి.