ప్రభాస్ భయమే నిజమయ్యింది

Published on Sep 11,2019 07:28 PM

భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాం కదా ! అందుకే భయంగా ఉంది పెద్దనాన్న అని ప్రభాస్ భయపడ్డాడట సాహో విడుదలకు ముందు. అయితే నీకు ఆ భయం అక్కర్లేదు నువ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ వి అంటూ ధైర్యం చెప్పాడు పెద్దనాన్న కృష్ణంరాజు. కట్ చేస్తే సాహో విడుదల అయ్యింది ప్లాప్ అయ్యింది , ఆ సినిమాని కొన్న బయ్యర్లను ముంచింది ప్రభాస్ భయం నిజమయ్యింది.

350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో ఆగస్టు 30 న విడుదలై మంచి వసూళ్ళని సాధించింది కానీ అమ్మిన రేటుకి వచ్చిన వసూళ్ల కు సంబంధం లేదు దాంతో సాహో ని కొన్న వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక ప్రభాస్ కు అయితే రిలీజ్ కి ముందు రిలీజ్ కి తర్వాత కూడా భయంతో నిద్ర పట్టలేదట. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాం అనే భయమే ప్రభాస్ ని వెంటాడింది పాపం , అయితే విడుదల అయ్యాక భయపడినంతా అయ్యింది. బాహుబలి తర్వాత తన రేంజ్ పెరగడంతో సంతోషంగా ఉన్న ప్రభాస్ కు సాహో పెద్ద గుణపాఠం నేర్పింది.