బ్యానర్ కడుతూ చనిపోయిన ప్రభాస్ అభిమాని

Published on Aug 29,2019 11:47 AM

సాహో విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమాని వెంకటేష్ మృత్యువాత పడ్డాడు.అత్యంత  విషాదం కలిగించిన ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా లో చోటు చేసుకుంది. ప్రభాస్ నటించిన సాహో చిత్రం రేపు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అభిమాన హీరో సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో వెంకటేష్ అనే ప్రభాస్ వీరాభిమాని ఫ్లెక్షీ ని కట్టబోతు కరెంట్ షాక్ కి గురయ్యాడు. 

థియేటర్ పైకి ఎక్కి బ్యానర్ కడుతున్న సమయంలో పక్కనే ఉన్న కరెంట్ తీగలు తగిలి షాక్ కి గురయ్యాడు , ఆ వెంటనే షాక్ తో థియేటర్ పై నుండి కింద పడిచనిపోయాడు. వెంకటేష్ మృత్యువాత పడటంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం వెంకటేష్ మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ మృతితో వెంకటేష్ ఇంట విషాదం అలుముకుంది.