మరో 50 లక్షల విరాళం ప్రకటించిన ప్రభాస్

Published on Mar 30,2020 11:24 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటికే కరోనా మహమ్మారి పై పోరాటానికి మద్దతుగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు 4 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభాస్ తాజాగా మరోసారి మరో 50 లక్షల విరాళం ప్రకటించాడు దాంతో మొత్తం నాలుగున్నర కోట్లు విరాళం ఇచ్చినట్లయింది. ఇక ఇప్పుడు తాజాగా ప్రకటించిన 50 లక్షలు సినీ కార్మికుల కోసం. షూటింగ్ లు లేక సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాంతో ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నాడు ప్రభాస్.

బాహుబలి తో ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రభాస్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది మార్కెట్ పెరగడంతో రెమ్యునరేషన్ కూడా ఎవరూ ఊహించని స్థాయిలో తీసుకుంటున్నాడు ప్రభాస్. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ చేసిన సాహో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ వసూళ్లు మాత్రం బాగానే రాబట్టింది. ఇక ఇప్పుడేమో ఓమై డార్లింగ్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్.