హీరోగా 17 ఏళ్ళు పూర్తిచేసుకున్న ప్రభాస్

Published on Nov 11,2019 05:30 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పరిచయమై అప్పుడే 17 ఏళ్ళు పూర్తయ్యాయి. పెద్దనాన్న కృష్ణంరాజు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈశ్వర్ చిత్రంతో 2020 నవంబర్ 11 న విడుదల అయ్యింది. ఆ సినిమా పెద్ద హిట్ కాదు కానీ కొన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడి యావరేజ్ గా నిలిచింది. ఇక ప్రభాస్ ని హీరోగా ప్రేక్షకులు ఆదరించడం ఖాయమనే ధీమాని అందించింది కూడా. అయితే కమర్షియల్ సూపర్ హిట్ ని అందుకుంది మాత్రం వర్షం చిత్రంతోనే. దాని తర్వాత ఛత్రపతి తో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత పలు సూపర్ హిట్ లు సూపర్ ప్లాప్ లతో కెరీర్ లో ముందుకు సాగాడు ప్రభాస్. అయితే ఈ హీరోని నేషనల్ స్టార్ ని చేసింది మాత్రం బాహుబలి చిత్రాలే ! బాహుబలి 1 , బాహుబలి 2 రెండు కూడా తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి దాంతో ప్రభాస్ పై భారీ ఒత్తిడి నెలకొంది. ఇటీవలే సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ హీరోగా పరిచయమై అప్పుడే 17 ఏళ్ళు పూర్తికావడంతో అప్పుడే అన్నేళ్లు గడిచాయా ? అన్నట్లుగా ఉంది.