అనుష్క పై ఫిర్యాదు చేస్తున్న ప్రభాస్

Published on Aug 27,2019 02:12 PM

అనుష్క నా ఫోన్ కూడా సరిగా ఎత్తదు అంటూ ఆమెపై ఫిర్యాదు చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో విడుదల అవుతున్న నేపథ్యంలో పలు చానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ప్రభాస్. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ప్రభాస్ అనుష్క పై ఆరోపణలు చేసాడు. అనుష్క ఫోన్ ఎత్తదనే కంప్లైంట్ ఉందని మరీ విచిత్రం ఏంటంటే నా ఫోన్ కూడా ఎత్తదని అందుకే అనుష్క అంటే కోపమని , అనుష్కలో నాకు నచ్చని అంశం అదే అని అంటున్నాడు ప్రభాస్. 

అనుష్క - ప్రభాస్ ల మధ్య ఎఫైర్ ఉందని రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి, మా ఆమధ్య ఎలాంటిదేమీ లేదని ఈ ఇద్దరూ ఖండిస్తున్నా వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ చేసిన వ్యాఖ్యలతో మరింత దుమారం చెలరేగడం ఖాయం.