మంచు వారింట్లో ప్రభాస్

Published on Oct 28,2019 06:19 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచు వారింట్లో జరిగిన దీపావళి వేడుకలలో పాల్గొన్నాడు. మంచు మోహన్ బాబు తో కలిసి ప్రభాస్ డార్లింగ్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి ప్రభాస్ కు మంచు కుటుంబానికి మంచి స్నేహం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంతోనే తన ఇంట్లో జరిగే దీపావళి వేడుకలకు ప్రభాస్ ని ఆహ్వానించాడు మంచు విష్ణు. మంచు వారి ఆహ్వానం మేరకు వెళ్లిన ప్రభాస్ అక్కడ బాగానే సందడి చేసాడు.

ప్రభాస్ తో కలిసి మంచు మోహన్ బాబు , విష్ణు , వెరోనికా లు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ లు లేకుండా ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ వచ్చే నెల నుండి జాన్ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడు. సాహో భారీ వసూళ్లు సాధించినప్పటికీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు మరి ఈ జాన్ ఏమౌతుందో !