డైరెక్టర్ ని బూతులు తిట్టిన పోసాని

Published on Nov 30,2019 01:20 PM

తమిళ డైరెక్టర్ టి ఎన్ సంతోష్ ని బూతులు తిట్టాడట ప్రముఖ నటులు పోసాని కృష్ణమురళి. అయితే ఈ తతంగం ఇప్పటిది కాదు చాలా రోజులే అయ్యింది కానీ ఆలస్యంగా బయటకు వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ అయిన కనితన్ చిత్రాన్ని తెలుగులో '' అర్జున్ సురవరం '' గా రీమేక్ చేసారు. ఇక ఈ చిత్రానికి తమిళంలో దర్శకత్వం వహించిన సంతోష్ నే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించమని కోరారు దాంతో తెలుగులో రూపొందిన అర్జున్ సురవరం కు కూడా సంతోషే దర్శకత్వం వహించాడు.

అయితే ఓ సన్నివేశంలో పోసాని ని కాలితే తన్నే సన్నివేశం ఉంది ఆ సన్నివేశంలో నిజంగానే గట్టిగా తన్నమని చెప్పాడట దర్శకుడు. అయితే ఆ సన్నివేశంలో పోసాని నటించకుండా డూప్ ని పెట్టారట. ఆ డూప్ ని గట్టిగా తన్నడంతో కోపం ఆపుకోలేని పోసాని అమ్మనా బూతులు తిట్టాడట దర్శకుడు సంతోష్ ని . అయితే తమిళ దర్శకుడు కావడంతో పోసాని బూతులు అర్ధం కాలేదట.