నిహారిక సూర్యకాంతం ఓపెనింగ్స్ పూర్

Published on Mar 29,2019 02:04 PM

మెగా డాటర్ నిహారిక ప్రధానపాత్రలో నటించిన చిత్రం '' సూర్యకాంతం ''. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయ్యింది , అయితే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ దక్కలేదు ఈ సినిమాకు . సూర్యకాంతం చిత్రానికి ఒకే ఒక్క హైలెట్ నిహారిక నే ! మిగతా కాస్ట్ అండ్ క్రూ పెద్దగా పేరు లేని వాళ్లే దాంతో ఓపెనింగ్స్ లేకుండాపోయాయి . టాక్ బాగుంటే అప్పుడు కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది.

అయితే ఈ సినిమాపై మాత్రం నిహారిక చాలా ఆశలే పెట్టుకుంది . నేను నటించిన ఒక మనసు , హ్యాపీ వెడ్డింగ్ అంతగా ఆడలేదు కానీ ఈ సినిమా మాత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్ముతున్నాను అంటూ ధీమా వ్యక్తం చేసింది . ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకుంది రెండు తెలుగు రాష్ట్రాలలో దాంతో నిహారిక సినిమా హిట్ అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .