ఎన్టీఆర్ మహానాయకుడి పరిస్థితి దారుణం

Published on Feb 23,2019 02:52 PM

నిన్న రిలీజ్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది . రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన ఓపెనింగ్స్ రాబట్టింది . రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి రూపాయల షేర్ కూడా రాకపోవడం దారుణం . ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి నెలలో రిలీజ్ అయి ఘోర పరాజయం పొందింది దాంతో ఆ సినిమాని కొన్న బయ్యర్లు 50 కోట్ల మేర నష్టపోయారు . 

అందుకే ఎన్టీఆర్ మహానాయకుడు కూడా వాళ్ళకే ఇచ్చారు . అయితే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు దాంతో ఈ సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయేలా ఉంది అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఇక ఓవర్ సీస్ లో కూడా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి కలెక్షన్లు అంతగా లేవు . ఓవర్ సీస్ లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేసారు కానీ అక్కడ కూడా నిరాశాజనకంగా ఉన్నాయి వసూళ్లు .