పోలీసులకు ఫిర్యాదు చేసిన పూనమ్ కౌర్

Published on Apr 17,2019 04:06 PM

టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ పోలీసులను ఆశ్రయించింది . తనపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారని , అటువంటి వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఫిర్యాదు చేసింది . పూనం కౌర్ ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు . పూనం కౌర్ పై అసభ్యకరమైన , అశ్లీలమైన వీడియోలను పలువురు యూట్యూబ్ లో పెట్టారు . 

వాటి లింక్ లను కూడా ఉదహరిస్తూ ఫిర్యాదు చేసింది పూనం . యూట్యూబ్ లింక్ లను ప్రస్తుతం పరిశీలించే పనిలో పడ్డారు పోలీసులు . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన పూనం కౌర్ కు హీరోయిన్ గా స్టార్ డం అయితే రాలేదు కానీ ఓ స్టార్ హీరో మాత్రం సన్నిహితంగా మెలిగాడు అన్న చర్చ సాగింది . అలాగే రాజకీయంగా కూడా పూనం కౌర్ వీడియోలను వాడుకున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు .