అఖిల్ కు హ్యాండ్ ఇచ్చిన పూజా హెగ్డే

Published on Sep 11,2019 07:19 PM

హీరోయిన్ పూజా హెగ్డే అక్కినేని అఖిల్ కు హ్యాండ్ ఇచ్చింది. తాజాగా ఈ భామ అఖిల్ సరసన నటించడానికి ఒప్పుకుంది , అయితే తీరా షూటింగ్ సమయానికి నా దగ్గర డేట్స్ ఖాళీగా లేవు ..... నేను ఈ సినిమా చేయలేను అంటూ అసలు విషయాన్నీ చెప్పిందట దాంతో షాక్ అయిన చిత్ర బృందం మరో హీరోయిన్ ని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు. ముందుగా నటిస్తానని చెప్పిన పూజా హెగ్డే  తీరా సమయానికి హ్యాండ్ ఇవ్వడం ఏంటో ?

  అఖిల్ హీరోగా పరిచయమైన తర్వాత మూడు చిత్రాల్లో నటించాడు మూడు కూడా డిజాస్టర్ లు అయ్యాయి. అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను చిత్రాల తర్వాత ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర పడిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. పూజా హెగ్డే హ్యాండ్ ఇవ్వడంతో మరొక భామ కోసం సెర్చింగ్ లో ఉన్నారు బొమ్మరిల్లు భాస్కర్ , అఖిల్ లు.