పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే

Published on Jan 18,2020 12:30 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రావడం ఖాయమైపోయింది. అయితే ఇంకా అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించలేదు కానీ లోలోన మాత్రం అన్నీ సిద్దమైపోతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ . కాగా ఆ సినిమా పూర్తి కాకముందే క్రిష్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు కాగా ఆ చిత్రంలో హీరోయిన్ గా హాట్ భామ పూజా హెగ్డే ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే అల ...... వైకుంఠపురములో చిత్రంలో నటించి భారీ హిట్ కొట్టింది పూజా హెగ్డే. ఆ సినిమా ఇచ్చిన జోష్ లో ఉన్న ఈ భామకు మరో గోల్డెన్ ఛాన్స్ లభించింది పవన్ కళ్యాణ్ రూపంలో. పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట దర్శకులు క్రిష్. ఇక పవన్ కళ్యాణ్ పచ్చజెండా ఊపడమే తరువాయి పూజా ని ఎంపిక చేస్తారు. వచ్చే నెలలో పింక్ రీమేక్ లో పాల్గొననున్నాడట పవన్ కళ్యాణ్.