లిప్ లాక్ గురించి నోరు విప్పిన పూజా హెగ్డే

Published on Dec 28,2019 05:12 PM
లిప్ లాక్ చూసేవాళ్లకు బాగానే ఉంటుంది చేసేవాళ్ళకే వణుకు పుడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ పూజా హెగ్డే. లిప్ లాక్ సీన్ చేయాలంటే చుట్టూ వందల మంది ఉంటారు పైగా కెమెరా యాంగిల్ కోసం కూడా ప్రయాస పడాలి అంతేనా ...... ఆ లిప్ లాక్ లో డైరెక్టర్ కు కావాల్సిన మూడ్ చూపించాలి అలాగే ప్రేక్షకులు ఆ లిప్ లాక్ ని ఆస్వాదించేలా చేయాలి అంటే ఎంత కష్టమో మీకు తెలియదు కానీ సింపుల్ గా లిప్ లాక్ అని మాత్రం అనేస్తారు అంటూ తన బాధని వ్యక్తం చేసింది పూజా హెగ్డే.

ఈ భామ హృతిక్ రోషన్ కు మొహంజదారో చిత్రంలో లిప్ లాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సీన్ చేయడానికి చాలా భయపడిందట పూజా హెగ్డే. ఎందుకంటే ఇంతకుముందు తనకు లిప్ లాక్ అనుభవం లేదని , పైగా ఇస్తున్న లిప్ లాక్ చాలామంది ముందర కావడంతో ఒంట్లో వణుకు పుట్టిందట. అయినప్పటికీ ఇష్టమైన హీరో కాబట్టి ధైర్యం చేసి లిప్ లాక్ ఇచ్చానని కానీ ఆ సీన్ వెనుక ఎంత అంతర్మధనం ఉంటుందో మీకు తెలుసా ...... అంటూ ప్రశ్నిస్తోంది పూజా హెగ్డే. ఈ భామ తాజాగా అల్లు అర్జున్ , ప్రభాస్ ల సరసన నటిస్తోంది.