బెట్టు చేస్తున్న పూజా హెగ్డే

Published on Apr 02,2020 03:48 PM
హాట్ భామ పూజా హెగ్డే తమిళ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ వస్తే వెంటనే ఒప్పుకోకుండా బాగానే బెట్టు చేస్తోంది. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ చిత్రం రూపొందనుంది ఆ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు పూజా హెగ్డే చెవిన పడటంతో ఎట్టకేలకు స్పందించింది. నేను తమిళ సినిమాలో నటుస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు చర్చలు మాత్రమే సాగుతున్నాయి ...... అన్నీ ఓకే అయితే నేనే చెబుతా అంటూ ట్వీట్ చేసింది పూజా హెగ్డే.

చర్చల దశలో ఉందంటే బహుశా రెమ్యునరేషన్ గురించి అనుకుంటా ....... ఈమధ్య పూజా హెగ్డే బాగానే డిమాండ్ చేస్తోంది. ఇంతకుముందు కోటిన్నర మాత్రమే తీసుకునే ఈ భామ ఇప్పుడు ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేస్తోందట. 4 అడిగితే రెండున్నర మూడు కోట్లకు బేరం కుదరకపోతుందా అన్న ధీమా అన్నమాట. రెమ్యునరేషన్ సెట్ అయితే అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నమాట.