అడవి శేష్ ని పోలీసులు బెదిరించారట

Published on Aug 24,2019 11:09 AM

ఢిల్లీ లో పది మంది పోలీసులు లాఠీలు పట్టుకొని నన్ను కొట్టడానికి వచ్చారని , బెదిరించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు హీరో అడవి శేష్ . ఎవరు విజయవంతమైన నేపథ్యంలో ఆ చిత్ర సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఈ హీరో తనకు ఎదురైనా చేదు అనుభవాలను పంచుకున్నాడు . నేను అమెరికా నుండి వచ్చినంత మాత్రాన బాగా డబ్బున్న వాడ్ని అని అనుకున్నారని , నేను కూడా అలాగే అనుకోవాలని పెద్ద పెద్ద వాళ్లతో కలిసిపోయానని అయితే రూమ్ రెంట్ కట్టేంత డబ్బులు కూడా లేని వాడ్ని అని వాళ్లకు తెలియదని సంచలన విషయాలు వెల్లడించాడు అడవి శేష్ . 

కొంతమంది దగ్గర అప్పు చేసి కిస్ అనే సినిమాని తీశానని , అయితే ఆ సినిమాకు రివ్యూస్ బాగా వచ్చాయి ని సినిమాకు పెట్టిన దాదాపు 3 కోట్లు నష్టపోయానని దాంతో అప్పు ఇచ్చిన వాళ్ళు నన్ను పోలీసుల చేత బెదిరించారని కానీ ఎవరు సక్సెస్ తర్వాత మా సినిమాలో నటించమంటే మా సినిమాలో నటించాలి అంటూ నిర్మాతలు నా వెంట పడుతున్నారని గతాన్ని నెమరు వేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు అడవి శేష్ .