పాట చిత్రీక‌ర‌ణ‌లో ఆది పినిశెట్టి `క్లాప్‌`

Published on Sep 27,2019 04:59 PM

విభిన్నమైన పాత్రలను చేస్తూ వెర్సటైల్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్న  ఆది పినిశెట్టి హీరోగా అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం `క్లాప్‌`.  ఐబీ కార్తికేయన్ సమర్పణలో ప్రిత్వి ఆదిత్య  దర్శకుడిగా  శ్రీ షిరిడీసాయి మూవీస్‌, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లోతెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా న‌టిస్తుంది.
ప్ర‌స్తుతం ఈ సినిమాలోని ఓ పాట‌ను హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌రిస్తున్నారు. దినేశ్ మాస్ట‌ర్ నృత్య రీతులు స‌మ‌కూరుస్తున్న ఈ స్పెష్‌ల్ సాంగ్‌లో మోనాల్ గ‌జ్జ‌ర్ న‌టిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. నాజ‌ర్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ధారులు.

న‌టీనటులు:
ఆది పినిశెట్టి
ఆకాంక్ష సింగ్
నాజర్
ప్రకాష్ రాజ్
క్రిష కురుప్
బ్రహ్మాజీ
ముండాసు పట్టి రాందాసు
మిమే గోపి
సూర్య
మీనా
వాసు         తదితరులు
సాంకేతిక నిపుణులు:
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
డిఒపి: ప్రవీణ్ కుమార్
ఆర్ట్: వైర బాలన్
ఎడిటర్: రాగుల్
ఫైట్స్ : శరవణన్
సమర్పణ: ఐబీ కార్తికేయ‌న్‌
కో-ప్రొడ్యూసర్స్: ఫై.ప్రభ ప్రేమ్,జి.మనోజ్, జి.శ్రీహర్
నిర్మాతలు;  రామాంజనేయులు జ‌వ్వాజి, యం. రాజశేఖర్ రెడ్డి
దర్శకత్వం; ప‌్రిత్వి ఆదిత్య